Monday, December 20, 2010

బాబు బుర్రలో లైటు వెలిగింది

ఊు... అంటే నేనే కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఇన్నాల్లూ కళ్లునెత్తికెక్కించుకుని తిరిగిన చంద్రబాబు ఇప్పుడు దారిన పడ్డాడు. 'వ్యవసాయం దండగ' అని అన్న వ్యక్తి నేడు అన్నదాతల కష్టాలు తీర్చాలంటూ నిరాహారదీక్ష చేస్తున్నాడు. కెసిఆర్‌లాగా ఒక్క రోజులో బిచాణా ఎత్తేసేందుకు ప్రయత్నించలేదు. సంతోషం. చంద్రబాబు మారాడా? మారితే మరీ మంచిది. ఇదే పద్ధతిలో ఎంత సేపు నిలబడతాడో వేచి చూడాల్సిందే...
బాబు ఏ పని చేసినా దాని వెనుక ఓ రెండు మూడు కారణాలుంటాయి. లక్ష్యాలు కూడా అన్నే ఉంటాయి. దీక్షలతో కూడా మనవాడు కుంభాన్ని కొట్టబోతున్నాడు. ఒకటి ఇన్నాళ్లూ పనీపాట లేని తెలుగు తమ్ముళ్లందరినీ 'రైతు' సమస్యలపై జనం దగ్గరికి వెళ్లేట్లు చేయగలిగాడు. జైతెలంగాణా, జై సమైక్యాంధ్ర నినాదాల రందిలో ఎటువైపు పోవాలో తెలియక తికమక పడుతున్న తమ్ముళ్లందరికీ నిజంగా రిలీఫే.. రెండోది కాంగ్రెస్‌ చీలిపోబోతోంది. జగన్‌ కొత్త పార్టీ పెడతానంటున్నాడు. ఆయన తన దగ్గరున్న డబ్బు చూసి విర్రవీగుతున్నాడు. వాళ్ల నాయన పేరును బ్రాండు ఇమేజీగా ప్రచారం చేసి గద్దె నెక్కాలనుకుంటున్నాడు. జగన్‌ చేసే ఏ ప్రయత్నమైనా కాంగ్రెస్‌ను చీల్చేయడం ఖాయం. అదే జరిగితే తక్షణం రాష్ట్ర వ్యాప్తంగా అడ్వాంటేజీ తీసుకుని గద్దెనెక్కాల్సిందీ తెలుగుదేశమే. కాంగ్రేసోళ్లు వాళ్ల పంచాయతీలో పడి జనం సమస్యలను మరిచిపోయారని, కమ్యూనిస్టోళ్లలాగా తాను కూడా సమస్యలపై పోరాడుతున్నానని చెప్పుకునేందుకు ఈ దీక్షలు చంద్రబాబుకు పనికొస్తాయి. మూడోది ప్రత్యేక తెలంగాణా అంశం... ఓ వైపు శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇవ్వబోతోంది. అదేం చెప్పినా రాష్ట్రం రావణకాష్టం కావడం ఖాయం. ఆ తరువాత జనం దగ్గరికి సమస్యలను, పార్టీని తీసుకుపోలేం. ఆ కమిటీ నివేదిక ఇచ్చేలోగానే ఇలాంటి కార్యక్రమం చేస్తే ఈ సమస్యా తీరిపోతుంది.
మొత్తానికి దీక్షలు చేపట్టాలనుకున్న బాబు నిర్ణయం రైట్‌ టైమ్‌లో రైట్‌ డెసిషన్‌ తీసుకున్నట్లుగా ఉంది. అయితే మళ్లీ చెబుతున్నా... చంద్రబాబు తాను తన మాట మీద ఎన్నాళ్లు నిలబడతాడు అన్నదానిపైనే ఫలితాలు ఉంటాయి.. వెయిట్‌ అండ్‌ సీ...

2 comments:

  1. చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, మీరు ఆశ పెట్టుకున్నంత మార్పేమీ రాదు. తెలంగాణలో ఇకపై చంద్రబాబుకి ఒక్క సీటు కూడా దక్కదనే విషయం కఠొరమైన వాస్తవం. ఇక ఆంధ్రాలొ అంతా జగన్ భజనలొ మునిగి తేలుతున్నారు. చంద్రబాబు ఆమరణ దీక్ష కన్నా జగన్ రెండు రోజుల దీక్షకే ఎక్కువ ఆదరణ లభించడం, అభిలషనీయం కాకపోయినా అది నిజం.

    దీనికి చంద్రబాబు చేసిన చారిత్రాత్మక తప్పిదాలు చాలా ఉన్నాయి. మొదట్లొ రైతును అస్సలు పట్టించు కోనివాడు ఇప్పుడు మారాడంటే నమ్మడం కష్టం. అలాగే మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి, దాన్ని ఏరులుగా పారించాడు. చివరగా తెలంగాణా, మొదట సమైఖ్యాంధ్రా వాది, తర్వాత తెలంగాణా వాది, తర్వాత రెండుకళ్ళ వాది.

    ఒక వైపు ప్రపంచ బ్యాంకుకు జై కొడతాడు. ఇంకోవైపు కమ్యూనిస్టులతో దోస్తీ చేస్తాడు. ఇలాంటివాణ్ణి జనం నమ్మడం కష్టం.

    ReplyDelete
  2. చంద్ర బాబు వేసుకున్న పరుపు, కప్పుకున్న ఉన్ని దుప్పటి బాగా 5స్టార్ హోటల్ లెవల్లో వున్నాయి. రైతులు అంత లగ్జురీగా నిద్రపోగలుగుతున్నారా? కంబళి కప్పుకుని, నేల మీద పడుకుని వుంటే ఓటేసే విషయం ఆలోచించవచ్చు. :)

    ReplyDelete