Tuesday, January 11, 2011

కామ్‌గా ఉందాం లేదా తరలిపోదాం

  • రాజధాని పారిశ్రామికవేత్తల మనోగతం
  • ఆందోళనకారులతో రాజీకి ప్రయత్నాలు
  • ప్రత్యామ్నాయంగా వైజాగ్‌, గుంటూరులో స్థలాల పరిశీలన
  • త్రిశంకు స్వర్గంలో మధ్యతరహా పరిశ్రమలు

హైదరాబాద్‌ నగరంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, వేర్పాటువాదుల దుందుడుకు చర్యలు పారిశ్రామికవేత్తలను బేజారెత్తిస్తున్నాయి. అయితే వారెవ్వరూ ఇప్పుడే బయటపడేందుకు సిద్ధంగా లేరు. అలాగని, భయాందోళనలనూ విడిచిపెట్టలేదు. ప్రత్యామ్నాయాలను వెతుక్కోవటమూ మానేయలేదు. ఏదో ఒక్క రంగం అని కాకుండా, దాదాపు అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి. 'ఇది ప్రజా ఉద్యమంగా కనిపించట్లేదు. ఆందోళనకారులు అతికొద్ది మందితో ముఠాలుగా ఏర్పడి విధ్వంసానికి పూనుకుంటున్నారు. వారు పిలుపు ఇచ్చినప్పుడల్లా బంద్‌ చేయకపోతే ఆస్థి పరంగా ఎలాంటి నష్టం సంభవిస్తుందో తెలియక తీవ్రంగా సతమత మవుతున్నాం.' అని బాలానగర్‌లోని మధ్యతరహా పారిశ్రామి కవేత్త ఒకరు ప్రజాశక్తితో చెప్పారు. ప్రజాశక్తి కలిసిన వారిలో దాదాపు అందరూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
'కామ్‌గా ఉందాం'
నగరం, నగర శివారుల్లోని పరిశ్రమాధిపతులంతా చెబుతున్నది ఇదే. కామ్‌గా ఉందాం... ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనే ఐడెంటిటీ చెప్పుకుని

Tuesday, January 4, 2011

ఆందోళనకర సంకేతాలు

ఒబామా చేత ఎదిగిన (ఎమర్జ్‌డ్‌) దేశంగా పిలవబడ్డ భారత్‌ మునిగిన (సబ్‌మర్జ్‌డ్‌) దేశంగా పిలిపించుకునే రోజులు దగ్గర పడ్డాయి. మన దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తాజాగా విడుదలైన గణాంకాలు చెబుతోన్న వాస్తవాలు దీనినే సూచిస్తున్నాయి. దేశాల మధ్య వడ్డీచెల్లింపులు, సరుకులు, సేవలు, ఇతర వాణిజ్య లావాదేవీలను గణించే కరెంటు ఖాతాలో లోటు ఏకంగా 72శాతం పెరిగింది. ఎగుమతులు తగ్గిపోయి, దిగుమతులు పెరిగినప్పుడు ఇది సంభవిస్తుంటుంది. ప్రపంచ సంక్షోభం ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న పరిస్థితుల్లో మన దేశం నుంచి ఎగుమతులు పెరిగాయి.
అది కూడా శాతాల్లో పెరుగుదల తప్ప పరిమాణంలో దిగుమతులతో పోటీ పడే స్థితిలో లేదు. 2009 ఏప్రిల్‌-నవంబర్‌ ఆరు నెలల కాలానికి, 6,960 కోట్ల డాలర్ల మేర ఉన్న వాణిజ్యలోటు, 2010లో ఇదే కాలానికి 8,160 కోట్ల బిలియన్‌ డాలర్లకు చేరింది. ఎగుమతులు భారీగా తగ్గడంతో ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా దేశీయ పారిశ్రామిక వేత్తలు తమ పరిశ్రమల ఆధునీకరణకు పూనుకున్నారు. ఇందుకోసం విదేశాల నుంచి యంత్రాలను విపరీతంగా దిగుమతి చేసుకుంటున్నారు. వీటిని కొనుగోలు చేసేందుకు విదేశీ మారకద్రవ్యాన్ని ఉపయోగించాల్సి వస్తోంది. మరోవైపు ఫ్యూచర్‌ట్రేడర్ల పుణ్యమా అని అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. దీంతో చమురు బిల్లుకూడా తడిసిమోపడవుతోంది. ఇవన్నీ కరెంటు ఖాతా లోటు ఒక్కసారిగా పెరిగేందుకు

Saturday, January 1, 2011

2011 - ఉపాధి హరణ సంవత్సరం?

90వేల చేపల వేట ఓడలతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న ఐరోపా యూనియన్‌కు ఒక కొత్త సమస్య వచ్చి పడింది. తమ ఓడలు గణనీయంగా మత్య్ససంపదను తోడేయడంతో ఇప్పుడక్కడ చేపలు దొరకట్లేదు. ఆ ఓడలకు కూడా పని లేకుండా పోయింది. వాటికి పని కల్పించేందుకు మన దేశ జలాల్లోకి పంపుతానని ఇయు చెబుతోంది. ఆ ఓడలు ఇక్కడ చేపలు పట్టి మనకే అమ్ముతాయట. అలా అమ్మే చేపలపై దిగుమతి సుంకాలు సున్నా స్థాయికి తీసుకురావాలట. సాధ్యమైనంత త్వరగా ఇలాంటి ఒప్పందంపైన సంతకం పెట్టాలని, లేదంటే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలోనైనా(ఎఫ్‌టిఎ) ఈ అంశాన్ని చేర్చాలని, అది కూడా ఈ మూడు నెలల్లోనే ఖరారు చేయాలని యుపిఎ-2 పాలకులపై ఇయు ఒత్తిడి తెస్తోంది. మన పాలకులు కూడా ఎఫ్‌టిఎలో ఏ అంశాలున్నాయో చెప్పట్లేదు. అత్యంత రహస్యంగా ఒప్పందాలను ఖరారు చేయబోతున్నారు.