- రాజధాని పారిశ్రామికవేత్తల మనోగతం
- ఆందోళనకారులతో రాజీకి ప్రయత్నాలు
- ప్రత్యామ్నాయంగా వైజాగ్, గుంటూరులో స్థలాల పరిశీలన
- త్రిశంకు స్వర్గంలో మధ్యతరహా పరిశ్రమలు
హైదరాబాద్ నగరంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, వేర్పాటువాదుల దుందుడుకు చర్యలు పారిశ్రామికవేత్తలను బేజారెత్తిస్తున్నాయి. అయితే వారెవ్వరూ ఇప్పుడే బయటపడేందుకు సిద్ధంగా లేరు. అలాగని, భయాందోళనలనూ విడిచిపెట్టలేదు. ప్రత్యామ్నాయాలను వెతుక్కోవటమూ మానేయలేదు. ఏదో ఒక్క రంగం అని కాకుండా, దాదాపు అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి. 'ఇది ప్రజా ఉద్యమంగా కనిపించట్లేదు. ఆందోళనకారులు అతికొద్ది మందితో ముఠాలుగా ఏర్పడి విధ్వంసానికి పూనుకుంటున్నారు. వారు పిలుపు ఇచ్చినప్పుడల్లా బంద్ చేయకపోతే ఆస్థి పరంగా ఎలాంటి నష్టం సంభవిస్తుందో తెలియక తీవ్రంగా సతమత మవుతున్నాం.' అని బాలానగర్‌లోని మధ్యతరహా పారిశ్రామి కవేత్త ఒకరు ప్రజాశక్తితో చెప్పారు. ప్రజాశక్తి కలిసిన వారిలో దాదాపు అందరూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
'కామ్‌గా ఉందాం'
నగరం, నగర శివారుల్లోని పరిశ్రమాధిపతులంతా చెబుతున్నది ఇదే. కామ్‌గా ఉందాం... ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనే ఐడెంటిటీ చెప్పుకుని