Friday, November 26, 2010
కొత్త సిఎం హిడ్డెన్ (రహస్య) ఎజెండా...! (పార్ట్ -3)
3. పథకాలన్నీ పేదలకే చేరాలి. లీకేజీలు వుండకూడదు : 2009 ఎన్నికలకు ముందు ఫుల్లుగా రేషన్‌కార్డులిచ్చారు. ఆరోగ్యశ్రీ అన్నారు. తెల్లకార్డు దివ్యౌవషధమన్నారు. సర్వరోగ నివారిణి అన్నారు. అడిగినోడికి, అడగనోడికీ ఇచ్చేశారు. ఎన్నికలైపోయాయి. కాంగ్రెసోళ్లు కళ్లద్దాలు మార్చేశారు. అవన్నీ లబ్దిదారుల వద్ద లేనట్లుగా కనపడిందట. 'బోగస్' అంటూ ఎత్తేశారు. ఇప్పుడు కిరణ్‌కుమార్ 'లీకేజీ' అంటున్నాడు. రెండింటి సారాంశం ఎత్తివేత. పేదోడు పథకానికి అప్లయి చేసుకున్నాడంటే ఐటి ఉద్యోగం సంపాయించినట్లే లెక్క. అన్ని ఇంటర్వ్యూలుంటాయి. ఆధారాలు చూపెట్టాలి. లబ్దిదారునిగా ముద్రేసుకోవాలంటే అంతకంటే ముందే పది మంది అమ్యామ్యాల లబ్దిదారులను మేపాలి.
Subscribe to:
Post Comments (Atom)
nee posts short and sweet gaa chaalaa baguntunnayi carry on annaaaaaaaaa
ReplyDeletesri